21-02-2025 10:23:09 PM
ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్..
ముషీరాబాద్ (విజయక్రాంతి): ఉగ్రవాదం దేశ భద్రతకు, శాంతికి అసమాన ముప్పుగా ఏర్పడిందని ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ ఆందోళన వ్యక్తం చేసారు. దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్లు సంభవించి నేటికీ 12 ఏళ్ళు పూర్తైన సందర్బంగా దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్లు జరిగిన ప్రాంతంలో ఆమ్ ఆద్మీ పార్టీ బాంబు పేలుళ్లు మృతులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా డాక్టర్ దిడ్డి సుధాకర్ మాట్లాడుతూ... పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం ద్వారా ప్రాథమిక మానవ హక్కులను ఉల్లంఘిస్తుందని అన్నారు.
భారతదేశంలో శతాబ్దాలుగా మతాల మధ్య సామరస్యంతో శాంతియుతంగా కలిసి జీవించిన సమాజంపై ఉగ్రవాదులు దాడి చేయడం దుర్మార్గమని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థవంతమైన ఉగ్రవాద నిరోధక చర్యలు చేపట్టి శాంతిని కాపాడాలని డాక్టర్ దిడ్డి సుధాకర్ కోరారు. ఈ కార్యక్రమంలో ఆప్ నేతలు డా.లక్ష్య నాయుడు, మౌనిక, రాకేష్ రెడ్డి, రెహమాన్, కరుణాకర్, అజీమ్ బేగ్ తదితరులు పాల్గొన్నారు.