calender_icon.png 25 February, 2025 | 5:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఛాంపియన్స్ ట్రోఫీకి ఉగ్రముప్పు

25-02-2025 02:33:09 AM

  • విదేశీ పౌరుల కిడ్నాప్‌కు ఐఎస్‌కేపీ ఉగ్రసంస్థ ప్రణాళికలు

డబ్బే ప్రధాన లక్ష్యం

పాకిస్థాన్ నిఘా సంస్థ హెచ్చరిక

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీని వీక్షించేందుకు వస్తున్న విదేశీ పౌరులను డబ్బు కోసం కిడ్నాప్ చేయడానికి ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ (ఐఎస్‌కేపీ) ప్రణాళికలు రచిస్తోంది. ఈ విషయాన్ని పాకిస్థాన్ నిఘా సంస్థ ప్రకటించింది. ఛాంపియన్స్ ట్రోపీకి హాజరవుతున్న విదేశీయులకు ఐఎస్‌కేపీ ఉగ్ర సంస్థ నుంచి కిడ్నాప్ ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు జారీ చేసింది.

ఈ ఉగ్రసంస్థ ప్రధానంగా చైనా, అరబ్ పౌరులను లక్ష్యంగా చేసుకున్నట్టు వెల్లడించింది. ఈ క్రమం లోనే ఈ రెండు దేశాల నుంచి వచ్చే సందర్శకులు తరచుగా ఉపయోగించే ఓడరేవులు, విమానాశ్రయాలు, కార్యాలయాలు, నివాస ప్రాంతాల్లో రెక్కీ నిర్వహిస్తున్న ట్టు పేర్కొంది.

భద్రతా సిబ్బంది కంట పడకుండా కిడ్నా ప్ చేసిన వారిని తరలించి, బంధించడానికి వీలుగా నగర శివార్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయని, రిక్షా, మోట ర్ సైకిల్ ద్వారా మాత్రమే చేరుకోవడానికి అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఇళ్లను అద్దెకు తీసుకునేందుకు ఐఎస్‌కేపీ ప్రణాళికలు వేస్తుందని నిఘా సంస్థ పేర్కొంది.

మరోవైపు ఐఎస్‌కేపీ దాడులు చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ  ఆఫ్ఘనిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారులను అప్రమత్తం చేసింది. ఆ గ్రూపుతో సంబంధం ఉండి కొద్దికాలంగా కనిపించకుండా పోయిన ఐఎస్‌కేపీ కార్యకర్తలను గుర్తించే ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టు తెలిపింది.

అంతర్జాతీయ కార్యక్రామాల భద్రతకు సం బంధించి పాక్ సామర్థ్యంపై ఆందోళనలు వ్యక్తం అవుతున్న తరుణంలో పాక్ నిఘా సంస్థ హెచ్చరికలు చర్చ నీయాంశం అయ్యాయి. గత ఏడాది షాంగ్లాలో చైనా ఇంజినీర్లపై దాడి జరిగింది.

అలాగే 2009లో శ్రీలంక క్రికెట్ జట్టుపై జరిగిన దాడి పాక్‌లో భద్రతా వైఫల్యాల ను బయటపెట్టింది. అయితే విదేశీయులపై దాడి జరిగిన ప్రతిసారి దాడి తీవ్రతను పాక్ తగ్గించి చూపించింది.