calender_icon.png 24 October, 2024 | 5:56 AM

తుర్కియే రాజధానిలో ఉగ్రదాడి

24-10-2024 03:28:00 AM

నలుగురు మృతి, 

పలువురికి గాయాలు

అంకారా, అక్టోబర్ 23: తుర్కియే రాజధాని అంకారాలో భారీ ఉగ్రదాడి జరిగింది. టర్కీ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ప్రధాన కార్యాలయంపై బుధవారం తుపాకులు, బాంబులతో దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డా రు. ఈ దాడి ఎవరు చేశారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఉగ్రవాదులు చాలామందిని బందీలుగా చేసుకున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. అధికారులు మాత్రం వీటిని ధ్రువీక రించలేదు. ఉద్యోగులు దాడి చేసిన వ్యక్తులు భవనంలోని రైఫిళ్లు, బ్యాగులు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. వీరు ఓ ట్యాక్సీలో వచ్చినట్లు సీసీటీవీల్లో రికార్డయింది. భద్రతా సిబ్బంది షిఫ్టులు మారే సమయంలో భవనంలోకి చొరబడినట్లు తెలుస్తోంది. టీయూఎస్‌ఏఎస్ టర్కీ అత్యంత కీలకమైన రక్షణ, విమానయాన సంస్థల్లో ఒకటి. టర్కీ మొదటి జాతీయ యుద్ధ విమానం కాన్‌ను ఉత్పత్తి చేసింది.