calender_icon.png 2 November, 2024 | 6:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోమాలియా రాజధానిలో ఉగ్రదాడి

04-08-2024 02:50:16 AM

32మంది మృతి, 63మందికి గాయాలు

న్యూ ఢిల్లీ, ఆగస్టు 3: సోమాలియా దేశంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శనివారం దేశ రాజధాని మొగదీషులోని లిడో బీచ్‌లోని ఓ హోటల్‌లో చొరబడి బీభత్సం సృష్టించారు. తొలుత గన్లతో కాల్పులు జరిపగా.. అనంతరం ఉగ్రవాదుల్లో ఒకడు తనను తాను పేల్చుకొని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో దాదాపు 32 మంది మరణించగా 63 మందికి తీవ్రగాయాలయ్యాయి. పేలుడు తీవ్రతకు బీచ్‌లో మృతదేహాలు చెల్లాచెదరురుగా పడిపోయిన దృశ్యాలను పలువురు సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ అయ్యాయి. మృతుల్లో ఒక సైనికుడు కూడా ఉన్నట్లు సమాచారం. భద్రతా సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. మరో దుండగుడిని పట్టుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. కాగా ఈ దాడులకు పాల్పడింది తామే అని షబాబ్ ఉగ్ర సంస్థ ప్రకటించింది.