25-04-2025 12:00:00 AM
మృతులకు నివాళులర్పించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
బోథ్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): జమ్మూకాశ్మీర్ పహల్గాంలో అమాయకమై న పర్యటకులపై ఉగ్రవాదులు కాల్పులతో మృతిచెందిన వారికి సంతాప సూచకంగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నివాళి అర్పించారు. నేరడిగొండ మండల కేంద్రంలో గురువారం క్రొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించా రు. ఈ సందర్భంగా స్థానికులు, బీఆర్‌ఎస్ నాయకులతో కొవ్వొత్తులు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మీడియాతో మాట్లాడుతూ కాశ్మీర్ లోగల పహల్గాంలో ఉగ్రదాడులకు పాల్పడటం సిగ్గుమాలిన చర్య అని బీఆర్‌ఎస్ పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇండియన్ నేవిలో లెఫ్టినెంట్ వినయ్ నర్వా ల్ సైతం ప్రాణాలుకోల్పోవడం దేశానికి తీరని లోటు అని, ఉగ్రవాదుల చర్యల వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.