calender_icon.png 23 December, 2024 | 8:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెర్రిఫిక్ నాగసాధు

22-12-2024 12:00:00 AM

తమన్నా భాటియా కీలక పాత్ర పోషిస్తున్న చిత్రం ‘ఓదెల 2’. 2021లో హిట్ అయిన ‘ఓదెల రైల్వేస్టేషన్’కు సీక్వెల్‌గా వస్తున్న సినిమా ఇది. అశోక్‌తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా నాగ సాధు పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలోని తన పాత్ర కోసం తమన్నా ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకోవటం విశేషం. తనదైన నటనతోపాటు స్టంట్స్ చేయడం ద్వారా ప్రేక్షకులకు అలరించేందుకు సిద్ధమైందామె. తాజాగా తమన్నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ చిత్ర నిర్మాతలు సరికొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. తమన్నాను తన పెరోషియస్ నాగ సాధు అవతార్‌లో ప్రజెంట్ చేస్తునన్నీ పోస్టర్‌లో ఆమె పుర్రెలపై ధైర్యంగా నడుస్తుంటే.. పైన రాబందులు ఎగరడం భయంగొల్పుతోంది. తమన్నాతోపాటు హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగమహేశ్, వంశీ, గగన్ విహారి, సురేందర్‌రెడ్డి, భూపాల్, పూజారెడ్డి ముఖ్య తారాగణంగా ఉన్న ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ లోక్‌నాథ్; డీవోపీ: సౌందర్‌రాజన్; ఆర్ట్ డైరెక్షన్: రాజీవ్ నాయర్.