విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి యూటీఎఫ్ నేతల వినతి
హైదరాబాద్, జనవరి 10 (విజయక్రాంతి): విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి యోగితా రాణా శుక్రవారం కొత్తగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా టీఎస్ యూటీఎఫ్ నేతలు చావ రవి, ఏ వెంకట్, టీ లక్ష్మారెడ్డి శుక్రవారం సచివాలయంలో ఆమెను కలిశారు. విద్యాశాఖలోని పలు సమస్యలను వివరించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. సర్వీస్ నిబంధనల సమస్యలను పరిష్కరించి, పర్యవేక్షణ వ్యవస్థను పటిష్ఠపరిచేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం ఆమెకు సంఘం డైరీని బహూకరించినట్లు పేర్కొన్నారు.