టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
తిరుమల, నవంబర్ 19: అలిపిరి వద్ద ముంతాజ్ హోటల్ నిర్మాణానికి కేటాయించిన 20 ఎకరాల భూమి లీజును రద్దు చేయాలని కోరుతూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు నేతృత్వంలోని పాలకమండలి ప్రభుత్వా నికి ప్రతిపాదనలు పంపింది. సోమవారం బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో ఆ స్థలాన్ని దేవలోకం ప్రాజెక్టుకు కేటాయించారని.. ఆ ప్రాజెక్టును దేవలో కం అని పిలిచేవారని అన్నారు.
కానీ గత వైసీపీ ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని రద్దుచేసి ఆభూమిని ముంతాజ్ హోటల్‌కు ఇచ్చిందని నాయుడు తెలిపారు. ఆ స్థలం ఆలయానికి సమీపంలో ఉంటుందని, హిందు వుల మనోభావాలకు వ్యతిరేకమని అందుకే పాలకమండలి సమావేశంలో లీజు రద్దు కోరుతూ తీర్మానం చేశామని ఆ భూమిని ఆలయానికి అప్పగిస్తామని నాయుడు తెలిపారు.