- సహచర విద్యార్థుల దాడితో మనస్థాపం
- పురుగుల మందు తాగిన వైనం
- పరిస్థితి విషమం.. దేవరకొండలో ఘటన
నల్లగొండ, నవంబర్ 14 (విజయక్రాం తి): పాత వివాదం ఓ టెన్త్ విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చింది. గతంలో తనతో కలిసి చదివిన ఇద్దరు కక్ష పెంచుకుని విచక్షణారహితం గా దాడి చేయడంతో మనస్థాపానికి గురైన పురుగుల మందు తాగాడు. నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలో జరిగిన ఈ ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం ది.
దేవరకొండ మండలం శేరిపల్లి పంచాయ తీ ఆవాసం పెద్దతండాకు చెందిన ఓ విద్యార్థి దేవరకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. గతేడాది పెద్దవూరలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదివిన సమయంలో ఇద్దరు సహచర విద్యార్థులతో ఓ విషయంలో గొడవ పడ్డాడు. ఇది మనసులో పెట్టుకున్న ఆ విద్యార్థులు ఈ నెల 11న దేవరకొండలోని పాఠశాలకు వెళ్లి దాడి చేసినట్లు తెలిసింది.
దీంతో మనస్థాపానికి గురైన బాధిత విద్యార్థి పురుగుల మందు తాగినట్టు సమాచారం. దేవరకొండలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు దేవరకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్న ట్లు ఎస్సై నర్సింహులు తెలిపారు.