calender_icon.png 30 April, 2025 | 6:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు టెన్త్ ఫలితాలు

30-04-2025 12:50:54 AM

సీఎం చేతుల మీదుగా మధ్యాహ్నం ఒంటిగంటకు విడుదల

హైదరాబాద్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): పదో తరగతి ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను మధ్యాహ్నం ఒంటి గంటకు రవీంద్ర భారతిలో సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ పరీక్షల విభా గం అధికారులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. గతంలో విద్యాశాఖ మంత్రుల చేతుల మీదుగా పదో తరగతి ఫలితాలు విడుదలయ్యేవి.

అయి తే, ప్రస్తుతం విద్యాశాఖ సీఎం వద్దే ఉంది. ఈ క్రమంలో ఈసారి ఫలితా ల విడుదల కార్యక్రమానికి స్వయం గా సీఎం రేవంత్‌రెడ్డి హాజరవుతున్న ట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్టారావు పేర్కొన్నారు.  మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు రాష్ట్రవ్యాప్తం గా పదో తరగతి పరీక్షలు జరిగాయి.

ఈ పరీక్షలకు దాదాపు 5 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. జవాబు పత్రాల మూ ల్యాంకనం పూర్తికావడం, మార్కుల మెమోలను ఎలా ఇవ్వాలన్న అం శంపై స్పష్టత రావడంతో ఫలితాల విడుదలకు అధికారులు సిద్ధమయ్యారు. ఇదిలా ఉంటే, ఇక నుంచి పదో తరగతి మెమోల్లో సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వనున్నారు.

సబ్జెక్టుల వారీగా రాత పరీక్ష లు, ఇంటర్నల్ పరీక్షల మార్కులతోపాటు విద్యార్థి సాధించిన మొత్తం మార్కులు, గ్రేడును పొందుపరచనున్నారు. చివరకు విద్యార్థి ఉత్తీర్ణత సాధించిందీ లేనిదీ తెలపనున్నారు. వీటితోపాటు కో కరిక్యులర్ కార్యక్రమాల్లో విద్యార్థులు సాధించిన గ్రేడ్ల ను పొందుపర్చనున్నారు.