27-03-2025 01:40:29 AM
కామారెడ్డి, మార్చి 26 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ ఉన్నత పాఠశాలలో బుధవారం గణిత పరీక్ష పత్రం బయటకు రావడం కలకలం రేపింది. పరీక్ష కేంద్రంలో పనిచే స్తున్న కొంతమంది కిందిస్థాయి సిబ్బంది ప్రైవేటు పాఠశాలల యజమానులతో కుమ్మక్కై విద్యార్థులకు అందించేందుకు పరీక్ష సమయం పూర్తి కాకముందే గణిత ప్రశ్నాపత్రం బయటకు తెచ్చి, ప్రశ్నలకు సంబంధించిన జవాబులను అందించే ప్రయ త్నం చేసినట్టు తెలుస్తున్నది.
ప్రశ్న పత్రం బయటకు రావడం ప్రతిరోజు మామూలుగానే జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. పరీక్ష కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న అధికారులను సస్పెండ్ చేశారు. పరీక్ష కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న చీఫ్ సూపరింటెండెంట్ డోంగ్లి, ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ సునీల్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్ భీమ్, ఇన్విజిలేటర్ దీపికను విధుల నుంచి సస్పెండ్ చేసినట్టు డీఈవో రాజు బుధవారం రాత్రి తెలిపారు.