calender_icon.png 24 January, 2025 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్చి 6 నుంచి టెన్త్ ప్రీ ఫైనల్స్

24-01-2025 12:18:29 AM

షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ

హైదరాబాద్, జనవరి 23 (విజయక్రాంతి): రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్థులకు మార్చి 6 నుంచి 15 వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ గురువారం షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి ప్రతీరోజు మధ్యాహ్నం 1.15 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి.

ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ పరీక్షలను గంటన్నర వ్యవధిలోనే నిర్వహించనున్నారు. ఈ రెండు పేపర్లను మధ్యాహ్నం 1.15 గంటల నుంచి 2.45 వరకు నిర్వహిస్తారు. ఎస్సెస్సీ వార్షిక పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగునున్న విషయం తెలిసిందే.

పరీక్షల షెడ్యూల్

మార్చి 6 - ఫస్ట్ లాంగ్వేజ్, మార్చి 7 - సెకండ్ లాంగ్వేజ్, మార్చి 10 - థర్డ్ లాంగ్వేజ్, మార్చి 11 - మ్యాథ్స్, మార్చి 12 - ఫిజికల్ సైన్స్, మార్చి 13 - బయోలాజిక్ సైన్స్, మార్చి 15 - సోషల్ స్టడీస్