calender_icon.png 10 March, 2025 | 11:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెన్త్ హాల్‌టికెట్లు విడుదల

08-03-2025 12:27:39 AM

ఈ నెల 21 నుంచి పదో తరగతి పరీక్షలు

హైదరాబాద్, మార్చి 7 (విజయక్రాంతి): తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు శుక్రవారం విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్ నుంచి విద్యార్థులు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభా గం సంచాలకుడు ఏ.కృష్ణారావు తెలిపారు. ఏవైనా కారణాలతో పాఠశాల ల యాజమాన్యాలు హాల్‌టికెట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తే వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూ చించారు.

ఈ నెల 21వ తేదీన ప్రా రంభం కానున్న పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 4 వరకు జరగనున్నా యి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనున్న పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తం గా 4.97 లక్షల మంది విద్యార్థులు హాజరవ్వనున్నారు. మొత్తం 2,500 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.