calender_icon.png 1 February, 2025 | 6:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెన్త్ విద్యార్థులకు అభ్యాసదీపికలు ఇవ్వాలి

31-01-2025 01:31:06 AM

విద్యాశాఖ అధికారులకు గెజిటెడ్ హెడ్మాస్టర్ల విజ్ఞప్తి

హైదరాబాద్, జనవరి 30 (విజయక్రాం తి): పదో తరగతి వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాల కోసం విద్యార్థులకు లాంగ్వేజ్ సబ్జెక్టుల అభ్యాస దీపికలు అందించాలని తెలంగాణ గెజిటెడ్ హెడ్మాస్టర్స్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ రాజగంగారెడ్డి, ప్రధానకార్యదర్శి ఎస్ గిరిధర్ గౌడ్ కోరారు. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ అధికారులకు గురువారం వారు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. నియామకంతో పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తామని వెల్లడించారు.