calender_icon.png 18 March, 2025 | 5:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదవతరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం

17-03-2025 08:11:08 PM

దుమ్ముగూడెం,(విజయక్రాంతి): దుమ్ముగూడెం మండలం నరసాపురం గ్రామంలోని సూది రెడ్డి నాగిరెడ్డి ఆదిలక్ష్మమ్మ మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశాన్ని 9వ తరగతి విద్యార్థుల ఆధ్వర్యంలో జరిగింది. సమావేశానికి అధ్యక్షత వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు బెక్కంటి శ్రీనివాసరావు మాట్లాడుతూ... రానున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులందరూ ధైర్యంగా పరీక్షలు రాయాలని ఎలాంటి ఆందోళన చెందవద్దని, మంచి ఫలితాలతో పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరడమైనది.

ఈ కార్యక్రమానికి అతిథులుగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ శ్రీమతి రత్నకుమారి, పూర్వ ప్రధాన ఉపాధ్యాయులుగా పని చేసిన బోళ్ల వెంకటేశ్వర్లు హాజరైనారు. వారు విద్యార్థులు పరీక్షలు బాగా వ్రాయాలని ఆశీస్సులు అందజేశారు. బోళ్ల వెంకటేశ్వర్లు  పాఠశాల అభివృద్ధి కోసం పది వేల రూపాయలను విరాళంగా ప్రకటించడం జరిగింది. పాఠశాలలోనే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ 10వ తరగతి విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ తో ఆశీస్సులు అందజేశారు, అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ సమావేశం ముగిసింది