calender_icon.png 19 April, 2025 | 4:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన పదో తరగతి పరీక్షలు

03-04-2025 12:00:00 AM

మహబూబాబాద్  ఏప్రిల్ 2 (విజయ కాంతి): మహబూబాబాద్ జిల్లా జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా మీ సాయి మండల కేంద్రంలో ప్రశాంతంగా ముగిసిన పదో తరగతి పరీక్షలు పది పరీక్షలు ముగిసిన సందర్బంగా.చివరి రోజున  గాంధీనగర్ గిరిజన గురుకుల పరీక్ష కేంద్రంలో పరీక్షల అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మండల విద్యాధికారి గుమ్మడి లక్ష్మి నారాయణమాట్లాడుతూ ఉన్నత చదువుల పట్ల అవగాహన కల్పించారు.

పదిలో ఉత్తీర్ణత సాధించిన ప్రతి విద్యార్ధి. ఇంటర్,ఆ పై చదువుల్లో రాణించి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి ఉన్నతులుగా జీవితంలో స్థిరపడాలని సూచించారు. జీవితంలో పదో తరగతి తొలి మెట్టు అని ఇక్కడ పట్టు తప్పకుండా ముందుకెళ్లాలని, తప్పినా నిరుత్సాహానికి లోనుకావద్దన్నారు. ముఖ్యంగా మొబైల్ ఫోన్ ఎంత అవసరమో అంతే ప్రమాదం కూడా ఉందని, అవసరానికి, మించిఉపయోగించడంఅలవాటుచేసుకోవాలన్నారు.

ఇంటర్ ప్రవేశానికి ప్రకటన వచ్చిన గురుకుల కళాశాలలు, పాలిటెక్నిక్.ప్రతి దానికిధరఖాస్తూచేసుకోవాలని సూచించారు. కొత్తగూడ పోలీస్ కానిస్టేబుల్ ప్రశాంత్  సైబర్ క్రెమ్ నేరాలపై అవగాహన కల్పిస్తూ.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈకార్యక్రమంలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్ ఉపేందర్ పాల్గొన్నారు.