calender_icon.png 4 April, 2025 | 2:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన టెన్త్ పరీక్షలు

03-04-2025 12:00:00 AM

ముషీరాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి) : ముషీరాబాద్ విద్యా మండలి పరిధిలో పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ నెల 21 నుంచి ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు బుధవారంతో ముగిశాయి. మండల పరిధిలో 4807 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నామని ముషీరాబాద్ విద్యా మండలి డిప్యూటీ ఈవో శ్రావణ్ కుమార్ తెలిపారు.