21-03-2025 09:11:29 AM
హైదరాబాద్: టెన్త్ క్లాస్ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పదో తరగతి పరీక్షలు(TS SSC Exams 2025) వచ్చేశాయ్. తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం నుంచి పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్ష ప్రారంభమైన ఐదు నిమిషాల వరకు విద్యార్థులకు కేంద్రాల్లో అనుమతించనున్నారు అధికారులు. 2,650 పరీక్ష కేంద్రాల్లో 5,09,403 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. తెలంగాణలో నిర్వహిస్తున్న టెన్త్ ఎగ్జామ్‌లో తొలిసారి విద్యార్థులకు 24 పేజీల బుక్‌లెట్ ఇవ్వనున్నారు. ఎలాంటి అడిషనల్ పేజీలు ఇవ్వబోమని అధికారులు స్పష్టం చేశారు.