calender_icon.png 30 October, 2024 | 12:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదో తరగతి బాలికపై లైంగిక దాడి

30-10-2024 12:33:32 AM

హుస్నాబాద్‌లో ఘటన

ముగ్గురు నిందితుల్లో ఒకరు మైనర్

సిద్దిపేట, అక్టోబర్ 29 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. పదో తరగతి బాలికపై ఇద్దరు యువకులు, ఒక బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ నెల 27న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 27న రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో ఇంటి ముందు ఆడుకుం టున్న బాలికను నిందితులు సమీపంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల భవనం వెనుక గదిలోకి లాక్కెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.

మరుసటి రోజు బాలిక విషయం తన కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో బాధితురాలి తల్లి మంగళవారం అదే ప్రాంతానికి చెందిన నిందితులు ప్రభాస్, శేఖర్, భరత్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. కాగా, నిందితుల్లో ఒకరు మైనర్‌గా గుర్తించారు.