21-03-2025 06:09:37 PM
హుజురాబాద్,విజయక్రాంతి: రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ప్రారంభమైన పదవ తరగతి వార్షిక పరీక్షలు హుజురాబాద్ డివిజన్ లో ప్రశాంతంగా జరిగాయి. హుజురాబాద్ మండలంలో 10వ తరగతి వార్షిక పరీక్షలు వ్రాసే విద్యార్థుల కోసం నాలుగు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. హుజురాబాద్ పట్టణంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ సెకండరీ బాలికల పాఠశాల, జిల్లా పరిషత్ సెకండరీ బాలుర పాఠశాల తో పాటు చెల్పూర్ లోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలు పరీక్ష కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. 8 15 మంది రెగ్యులర్ విద్యార్థులకు గాను ఇద్దరు విద్యార్థులు గైరాజరైనట్లు నలుగురు ప్రైవేటు విద్యార్థులకు ఒక విద్యార్థి పరీక్షకు గైరాజరైనట్లు హుజురాబాద్ ఎంఈఓ భూపతి శ్రీనివాస్(Huzurabad MEO Bhupathi Srinivas) తెలిపారు. పరీక్షల నిర్వహణ సక్రమంగా జరగడం కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రతి సెంటర్లో సెట్టింగ్ స్క్వాడ్ ప్రభుత్వ నియమించిందన్నారు. దీనికి తోడు పోలీస్ శాఖ ప్రతి సెంటర్ వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి పరీక్షలు సక్రమంగా జరిగే విధంగా చూశారు.