calender_icon.png 22 March, 2025 | 8:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు

21-03-2025 11:51:32 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి) బెల్లంపల్లి నియోజక వర్గ వ్యాప్తంగా శుక్రవారం పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటిరోజు తెలుగు పరీక్ష రాసేందుకు విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. విద్యార్థులకు ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా ఉపాధ్యాయులు పరీక్ష కేంద్రాల వద్ద హాల్ టికెట్ నెంబర్లను సరిచూస్తూ కేటాయించిన గదులను చూపించారు. ఉదయం నిర్దేశించిన సమయానికే విద్యార్థులు కేంద్రాల వద్ద కనిపించారు. ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.