- పెంచిన పరీక్ష విధుల పారితోషకాన్ని అమలు చేయాలి
- పాఠశాల విద్యా డైరెక్టర్‌కు టీజీహెచ్‌ఎంఏ విజ్ఞప్తి
హైదరాబాద్, నవంబర్ 15 (విజయక్రాంతి): పదో తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లించే గడువును ఈ నెల 30 వరకు పొడిగించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు తెలంగాణ గెజిటెడ్ హెడ్‌మాస్టర్ల సంఘం రాష్ట్ర అ ధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజభా ను చంద్రప్రకాశ్, రాజగంగారెడ్డి విజ్ఞ ప్తి చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో వి ద్యార్థులకు పరీక్ష ఫీజు మినహాయిం పు ఇవ్వాలని శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. పదో తరగతి పరీక్ష ప త్రాల మూల్యాంకన కేంద్రాలు 33 జి ల్లాల్లో ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు పరీక్షా కేంద్రాలను సమీప పాఠ శాలల్లో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తిచేశారు. ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించేటప్పుడు ఉదయం అల్పాహా రం, సాయంత్రం స్నాక్స్ అందించాలని కోరారు.
పరీక్ష విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి చెల్లించే పారితోషకాన్ని పెంచుతూ 2018లో జారీ చేసిన జీవోను అమలు చేయాలని పేర్కొన్నారు. గత ఏడాది ఎస్‌ఎస్‌సీ పరీక్షలు, స్పాట్ వ్యాల్యుయేషన్ పారితోషకాన్ని, టీఏ డీఏలను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తిచేశారు.