22-03-2025 12:00:00 AM
ముషీరాబాద్, మార్చి 21: (విజయక్రాంతి) : ముషీరాబాద్‌లో 10 వ తరగతి పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ప్రారంభం అయ్యాయి. ముషీరాబాద్ విద్యామండలి పరిధిలో ఏర్పాటు చేసిన 23 పరీక్షా కేంద్రాలలో 4,719 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 4,692 మంది విద్యార్థులు హాజరయ్యారు. 27 మంది విద్యా ర్థులు పరీక్షలకు గైర్హాజర్ అయ్యారు.
విద్యార్థులు ఉదయం 8 గంటలకే వారి తల్లిదండ్రులతో పరీక్షా కేంద్రాలకు చేరుకు న్నారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీలు చేసి పరీక్షా కేంద్రంలోకి పంపించారు. ముందు జాగ్రత్తగా పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు, వైద్య శిబిరాన్ని సైతం ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం 10వ తరగతి విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెబుతూ ప్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేశారు.
ఈ ప్లెక్సీ బోర్డులో సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ చిత్రా పటాలతో పాటు పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెబుతన్న ప్లెక్సీ ఉపాధ్యా యులు, విద్యార్థులు, వారి తలిదండ్రులను ఆకట్టుకున్నది. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.