calender_icon.png 24 February, 2025 | 3:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెన్షన్.. టెన్షన్

24-02-2025 12:38:04 AM

  1. కార్మికులను రక్షించేందుకు కొనసాగుతున్న సహాయక చర్యలు
  2. ఉమ్మడి రెస్క్యూ టీమ్ ప్రయత్నాలకు అడ్డంకిగా బురద, నీటి ఊట ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లోని ఘటనా స్థలానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్
  3. ఆశలు సన్నగిల్లుతున్నాయని ఆవేదన
  4. చివరి వరకూ ప్రయత్నాలు కొనసాగిస్తామని వెల్లడి

నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): శ్రీశైలం ఎడమ గట్టు టన్నెల్‌లో జరిగిన ప్రమాద ఘటనలో చిక్కుకుపోయిన కార్మికులను కాపాడే రెస్క్యూ టీం ఆపరేషన్ టెన్షన్ వాతావరణం మధ్య సాగుతోంది. ప్రమాదం జరిగి 40 గంటలు గడుస్తున్నప్పటికీ కార్మికుల క్షేమసమాచారం రాకపోవడం తో కార్మికుల కుటుంబ సభ్యులతో పాటు ప్రజలను కలవరపెడుతోంది. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి అని గ్రహించినప్పటికీ రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సుమారు ఐదున్నర గంటలపాటు ప్రమాదం జరిగిన ప్రాంతానికి సొరంగ మార్గంలో రెస్క్యూ టీమ్‌తో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

సొరంగ మార్గంలోని 14 కిలోమీటర్ల దూరంలో సుమారు మూడు మీటర్ల పరిధిలో నీటిఊట వల్ల మట్టిదిబ్బలు కూలి ప్రస్తుతం నీటి ఉధృతి వల్ల సుమారు 200 మీటర్ల వరకు ఆరు మీటర్ల ఎత్తులో బురదనీరు పేరుకుపోయింది. దీంతో రెస్క్యూ ఆపరేషన్ చేసేందు కు అడ్డంకిగా మారింది. 9 మీటర్ల వ్యాసార్థం ఉన్న సొరంగ మా ర్గంలో 6 మీటర్ల మేర బురద, నీటిఊట పేరుకుపోవడంతో పలుమార్లు రెస్క్యూ టీం ఘటనా స్థలానికి వెళ్లి వెనక్కి తిరిగాయి. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, సింగరేణి, ఆర్మీ, హై డ్రా రెస్క్యూ టీమ్‌లు ఉమ్మడిగా ఒక టీమ్‌గా ఏర్పడి కార్మికుల ప్రాణాలను కాపాడేందుకు కావాల్సిన ఏర్పాట్లు అన్ని సిద్ధం చేశారు.  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రు లు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో నిరంతరం సమీక్షిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో మంత్రి జూపల్లి కృష్ణారావు రెస్క్యూ టీమ్ వారితో పాటే లోక్ ట్రైన్ ద్వారా ఘటనా స్థలిని సందర్శించేందుకు వెళ్లారు. కానీ నీటిఊట భారీగా పెరగడంతో పాటు సుమారు 6 మీటర్ల వరకు జిగురు మట్టి లాంటి బురద పేరుకుపోవడంతో ముందుకు వెళ్లలేక ఇబ్బందులు పడ్డారు. దీంతో నదీజలాల్లో చేపలు పట్టేందుకు ఉపయోగించే బెండు వంటి వాటిని తెప్పించి నీటి ఉధృతి తగ్గిన అనంతరం బురదపై ప రుస్తూ సుమారు 100 మీటర్ల దూరం వర కు వెళ్లగలిగారు.

ఈ క్రమంలోనే ఇద్దరు ఇం జినీర్లు మరో ఇద్దరు ఆపరేటర్లతో పాటు న లుగురు కార్మికుల పేర్లు పెట్టి పిలుస్తూ కేకలు వేసినా ఫలితం లభించలేదని మంత్రి జూప ల్లి తెలిపారు. దాదాపుగా ఆశలు సన్నగిల్లుతున్నాయని తెలిపారు. అయినా చివరి వరకూ ప్రయత్నాలు కొనసాగిస్తామని తెలిపారు.

అడ్డంకిగా బురద, నీరు

సహాయక చర్యల్లో 130 మంది ఎన్డ్డీఆర్‌ఎఫ్, 120 మంది ఎస్డ్డీఆర్‌ఎఫ్, 24 మంది భారత ఆర్మీ, 24 మంది సింగరేణి రెస్యూ టీమ్, మరో 24 మంది హైడ్రా టీమ్ పా ల్గొంటున్నాయి. పలుమార్లు ఘటనా స్థలానికి వెళ్లేందుకు ప్రయత్నించినా మట్టి, బుర ద, నీటితో సాధ్యం కావడం లేదు.