calender_icon.png 12 January, 2025 | 2:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజర్వేషన్లపై టెన్షన్

01-12-2024 12:36:50 AM

  1. గ్రామాల్లో సర్పంచ్‌గిరిపై  కొనసాగుతున్న చర్చలు
  2. పంచాయతీ ఎన్నికలకు అధికారుల కసరత్తు

కామారెడ్డి, నవంబర్ 30 (విజయక్రాంతి): పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. కామారెడ్డి జిల్లాలో 535 గ్రామ పంచాయతీలు ఉండగా, 4,520 వార్డుల్లో ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. అయితే రిజర్వేషన్ల ప్రక్రియపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొనది. అయినా కూడా ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా పోటీల్లో ఉండేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

అందుకు కుల సంఘాలను కలుస్తూ మద్దతు కోరుతున్నారు. ఈ సారి పాత రిజర్వేషన్లు ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తారా, కొత్తగా రిజర్వేషన్లు మారుస్తారా అనే దానిపై ఆశావాహుల్లో టెన్షన్ మొదలైంది. 

కాంగ్రెస్‌లో జోష్

పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నాయకుల్లో జోష్ పెరిగింది.సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలపై ఆశలు పెంచుకుని పార్టీ పెద్దల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం మొదలు పెట్టారు. ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న వారు ఈసారి తమకు పదవీ యోగం ఉంటుందనే ఆశగా ఉన్నారు.

అధికారుల సమాయత్తం

కామారెడ్డి జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అధికారులు సమాయత్తం అయ్యారు. ఎన్నికల నిర్వహణకు అవసరమయ్యే బ్యాలెట్ బాక్స్‌లు, ఇతర ఏర్పాట్లపై కసరత్తు ప్రారంభించారు. జిల్లాలో 535 గ్రామ పంచాయితీలు,4686 వార్డు మెంబర్ల ఎన్నికలకు సంబంధించి గతంలో మాదిరిగానే మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశలు ఉన్నాయి.