27-03-2025 01:13:43 AM
భీమదేవరపల్లి మార్చి 26( విజయ క్రాంతి) హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులోని హైవే రోడ్డు నిర్మాణం పై ఉన్న అంబేద్కర్ విగ్రహంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎల్కతుర్తి నుండి మెదక్ వరకు కొనసాగుతున్న హైవే నిర్మాణం పనుల్లో భాగంగా ముల్కనూర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని ఆర్టీసీ వారి ఖాళీ స్థలం లోకి మార్చుతారని వదంతులు రావడంతో గత నాలుగు రోజుల నుండి ఆర్టిసి కి చెందిన విజిలెన్స్ పోలీసులు గత నాలుగు రోజులుగా నిద్రాహారాలు లేకుండా విస్తృతంగా పహార నిర్వహిస్తున్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఇప్పుడున్న స్థలం నుండి తొలగించబోమని తాసిల్దార్ ప్రవీణ్ కుమార్ పేర్కొంటున్నప్పటికీ హైవే అధికారులు అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించి ఆర్టీసీ వారి ఖాళీ స్థలంలో ఏర్పాటు చేస్తారని ఆ శాఖకు చెందిన అధికారులు పోలీసులు పహార నిర్వహిస్తున్నారు. ఈ విషయంపై మంత్రి సైతం అంబేద్కర్ విగ్రహాన్ని ఇప్పుడున్న చోటనే ఉంటుందని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఏది ఏమైనా అంబేద్కర్ విగ్రహం ఇప్పుడున్న చోటనే ఉంటుందా ?లేక మరోచోట ఏర్పాటు చేస్తారా ?అనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.