calender_icon.png 30 September, 2024 | 4:56 PM

నయీంనగర్ బ్రిడ్జి దగ్గర ఉద్రిక్తత.. దాస్యం వినయ్‌భాస్కర్ అరెస్ట్

30-09-2024 02:30:01 PM

హనుమకొండ: నయీమ్ నగర్ బ్రిడ్జి నిర్మాణం బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ ఘర్షణకు దారితీసింది. ఇటీవల బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలతో ఉత్కంఠ పెరగడంతో రెండు పార్టీలు ప్రాజెక్టుపై క్రెడిట్‌ కోసం పోటీపడుతున్నాయి. దీనిపై స్పందించిన కాంగ్రెస్ నేతలు ఈ అంశంపై బహిరంగ చర్చకు పిలుపునిచ్చారు. నయీమ్ నగర్ వంతెన వద్ద పెద్ద సంఖ్యలో గుమిగూడి సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చర్చలో పాల్గొనాలని బీఆర్‌ఎస్ నేతలకు సవాల్ విసిరారు.

బ్రిడ్జి నిర్మాణంపై రాజకీయ వేడిని మరింత పెంచుతూ తన వ్యాఖ్యలకు కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని నాయిని రాజేందర్ డిమాండ్ చేశారు. నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ బ్రిడ్జి దగ్గరకు వచ్చారు. అదే వేదికపై ప్రెస్ మీట్ పెట్టేందుకు కాంగ్రెస్ కార్పొరేటర్లు అక్కడికి చేరుకున్నారు. బీఆర్ఎస్, కాంగ్రస్ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకోవడంతో పోలీసులు భారీగా మోహరించారు. పరిస్థితిని అదుపుచేసేందుకు వినయ్ బాస్కర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను తరలిస్తున్న వాహనాన్ని  బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత వాతావరణ నెలకొంది.