calender_icon.png 11 January, 2025 | 6:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉట్నూర్ ఏజెన్సీలో ఉద్రిక్తత

06-10-2024 12:12:20 AM

ఇంద్రవెల్లిలో ఆక్రమణల కూల్చివేత

ఆందోళనకు దిగిన గిరిజనేతరులు

ఆదిలాబాద్, అక్టోబర్ 5 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలో శనివారం ఉద్రిక్తత నెలకొంది. ఇంద్రవెల్లి మండల కేంద్రంలో మార్కెట్ యార్డు ఎదురుగా ఉన్న నాలాపై నిర్మించిన ఇల్లుతోపాటు రహదారిని ఆనుకొని నిర్మించిన కొన్ని ఇళ్లను జేసీబీలతో అధికారులు కూల్చివేశారు.

అధికారుల తీరును నిరసిస్తూ ప్రధాన రహదారిపై గిరిజనేతరులు నల్ల బ్యాడ్జీలు ధరించి రాస్తారోకో చేపట్టారు. దశాబ్దాల తరబడి గిరిజనులతో కలిసి జీవనం కొనసాగిస్తున్న పేద మధ్యతరగతి గిరిజనేతరుల ఇళ్లను కూల్చివేసి ప్రభుతం తమపై కక్షసాధింపుచర్యలు చేపడుతుందని విమరించారు. మార్కెట్‌లో సచ్ఛందంగా దుకా ణాలు, వ్యాపార సంస్థలు మూసివేసి అధికారుల వైఖరికి నిరసనగా ధర్నా చేపట్టారు.

రాస్తారోకో కారణంగా కరీంనగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల్ జిల్లాల వైపు వెళ్లే వాహ నాలు రోడ్డుకి ఇరువైపులా కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. పోలీసులు, అధికారులు వచ్చి ఆందోళనకాలను సముదాయిం చినా ఫలితం లేకపోవడంతో సల్ప ఉద్రిక్తత నెలకొంది. భారీ ఎత్తున పోలీసు బలగాలు ఇం ద్రవెల్లికి చేరుకుని ఆందోళనకారులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశాయి.

ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్ గ్రామ పంచా యతీ కార్యాలయంలో గిరిజనేతరులతో కలి సి మాట్లాడారు. తాము 1/70 చట్టం కన్నా ముందు నుంచే ఇక్కడ నివాసం ఉంటున్నామని, ఇంటి ట్యాక్స్ కట్టుకుని నిర్మించు కున్నామని తెలిపారు ఎలాంటి నోటీసులు ఇవకుండా ఇళ్లను కూల్చివేశారని అన్నారు.

ఎన్నో ఏళ్లుగా ఇక్కడే నిసముంటున్న గిరిజనేతరులకు ఇల్లు కట్టుకునేందుకు హక్కు కల్పించాలని కోరారు. అధికారుల పరిశీలనలో అక్రమంగా కట్టారని తేలడంతోనే కూల్చివేశారని సబ్ కలెక్టర్ తెలిపారు. 

అక్రమ కట్టడాలపై చర్యలు: కలెక్టర్

ఏజెన్సీ ప్రాంతాల్లో అనుమతి లేకుండా ఇళ్ల నిర్మాణం చేపడితే ఉపేక్షించేదిలేదని కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు. ఇంద్రవెల్లిలో రెవెన్యూ, పోలీస్, పంచాయతీ అధికారులు ముందస్తు పరిశీలనలో ఇవి అక్రమ కట్టడాలని తేలాయని, ఆ తరాతే నోటీసులు ఇచ్చి కూల్చివేశామని తెలిపారు. ప్రైవేట్ స్థలాల్లోనైనా ఎక్కడైనా అధికారుల అనుమతి తీసుకొని ఇండ్ల నిర్మాణం చేపట్టాలన్నారు.