calender_icon.png 15 October, 2024 | 12:55 PM

యూపీ బహ్రైచ్‌లో ఉద్రిక్తత

15-10-2024 02:14:59 AM

  1. దుర్గామాత నిమజ్జనం సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ
  2. యువకుడి మృతి, పలువురికి గాయాలు

లక్నో, అక్టోబర్ 14: దుర్గామాత నిమజ్జనం సందర్భంగా రెండువర్గాల మధ్య జరిగిన ఘర్షణ రాళ్ల దాడులు, కాల్పులకు దారితీసింది. ఈ దాడుల్లో ఓ యువకుడు మరణించగా పలువురు గాయపడ్డారు.  ఉత్తరప్రదేశ్‌లని బహ్రైచ్ జిల్లాలో ఆదివారం దుర్గామాత నిమజ్జనం సందర్భంగా మహాసీ ప్రాంతం మీదుగా ఊరేగింపు సాగింది.

ఊరేగింపులో డీజే ప్లే చేయడంపై ఒక వర్గం అభ్యంతరం వ్యక్తం చేసిందది. దీంతో వాగ్వా దం జరగడంతో పాటు ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. ఊరేగింపులో పాల్గొన్నవా రిపై రాళ్లు రువ్వడంతో పాటు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఊరేగింపులో పాల్గొన్న వారు విధ్వంసానికి పాల్పడ్డారు. షాపులు, ఓ ఆసుపత్రిని ధ్వంసం చేశారు.

వాహనాలకు నిప్పుపెట్టారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఘర్షణల నేపథ్యంలో దుర్గామాత విగ్రహాల నిమజ్జనం నిలిచిపోయింది. పోలీసులు 30 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. కాల్పులకు పాల్పడింది సల్మాన్‌గా గుర్తించి అరెస్టు చేశారు.

మహాసీ జిల్లాలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. మరోవైపు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నతాధికా రులతో సమావేశమయ్యారు. అల్లర్లకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆదేశించారు. దుర్గామాత నిమజ్జ నాన్ని యథావిధిగా కొనసాగించాలన్నారు.