calender_icon.png 6 February, 2025 | 10:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నల్లవల్లిలో ఉద్రిక్తత

06-02-2025 01:23:18 AM

  • డంపింగ్ యార్డు వద్దంటూ నిరసనలు

నర్సాపూర్ ఎమ్మెల్యే సునితారెడ్డితోపాటు 

బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతల అరెస్టు 

పటాన్‌చెరు/గుమ్మడిదల, ఫిబ్రవరి 5: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి పరధిలోని ప్యారానగర్(సురారం) అట  ప్రాంతంలో డంపింగ్‌యార్డును ఏర్పాటు చేయవద్దంటూ స్థానికులు, పలు పార్టీల నా  ముందునుంచీ ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం కూడా పలు సంఘాలు, నాయకులు నిరసనలు చేశారు.

మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో డంపింగ్‌యార్డును వ్యతిరేకిస్తున్న బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయ  పాటు తాజామాజీ ప్రజాప్రతినిధు  యువజన సంఘాల నాయకులను పోలీసులు ఇండ్ల వద్దకు వెళ్లి ముందస్తు అరె  చేసి జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం చిద్రుప్పకు తరలించారు.

ఆ తర్వాత ప్యారా   150 ఎకరాల్లో నిర్మించబోయే డంపింగ్‌యార్డుకు కోసం అవసరమైన సామగ్రిని జీహెచ్‌ఎంసీ అధికారులు టిప్పర్‌ల ద్వారా పోలీసుల పహారాలో తరలించారు. బుధవా  ఉదయం డంపింగ్‌యార్డుకు వ్యతిరేకం  జాతీయ రహదారిపై రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. యువజన సం ప్రజలు ఆందోళణ చేశారు.

పోలీసులు వారిని అరెస్టు చేసి వివిద పోలీస్ స్టేషన్లకు తరలించారు. డంపింగ్‌యార్డు నర్సాపూర్ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు దగ్గరగా ఉన్నదని, నిర్మాణం చేపట్టవద్దంటూ న  ఎమ్మెల్యే సునితారెడ్డి నల్లవల్లికి వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. ఆమె అక్క  నర్సాపూర్, జిన్నారం, గుమ్మడిదల మం  బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు.

సునితారెడ్డితోపా  జిన్నారం మాజీ జడ్పీటీసీ బాల్‌రెడ్డి, రామచంద్రాపురం బీఆర్‌ఎస్ నేత ఆదర్శ్‌రెడ్డిలను పోలీసులు  అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో బీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు గోవర్ధన్‌రెడ్డి, మండలాధ్యక్షుడు కొత్త  ప్రభాకర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ కుమార్‌గౌడ్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు పుట్టన  ప్రతాప్‌రెడ్డి, హుస్సేన్, ఫయాజ్ ఉన్నారు.

ఆందోళన నేపథ్యంలో పోలీసులు నల్లవల్లి గ్రామంలో 144 సెక్షన్ విధించారు. నల్లవల్లి ప్రధాన ప్రవేశ మార్గంలో పోలీసులు భారీగా మొహరించారు. అన్నారం నుంచి నల్లవల్లి చౌరస్తా వరకు జాతీయ రహదారివెంట పోలీసులు మొహరించారు. 

యూరోపియన్ టెక్నాలజీతో డంప్‌యార్డు: జీహెచ్‌ఎంసీ అధికారులు

చట్ట ప్రకారమే, యూరోపియన్ టెక్నాలజీతో డంపింగ్‌యార్డు నిర్మిస్తున్నామని జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్ రఘుప్రసాద్, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్  శ్రీనివాస్‌రెడ్డి బుధవారం గుమ్మడిదలలో మీడియా సమావేశంలో తెలిపారు. డంపింగ్‌యార్డుతో ప్రజలకు ఎలాంటి హానీ ఉండదని చెప్పారు.

ప్రతి రోజు 130 వాహనాల్లో రెండు వేల టన్నుల చెత్త ప్యారానగర్‌కు వస్తుందని, పూర్తిగా యూరోపియన్ టెక్నాలజీతో డంప్‌యార్డు నిర్మాణం జరుగుతుందన్నారు. దీని వలన పర్యావరణానికి, ప్రజలకు ఎలాంటి నష్టం ఉండదన్నారు. 
 
సంగారెడ్డిని మరో జవహర్‌నగర్‌గా మారుస్తారా?

ఎంపీ రఘునందన్‌రావు

హైదరాబాద్ (విజయక్రాంతి): సంగారెడ్డిని మరో జవహర్‌నగర్‌గా మార్చటానికి కుట్ర జరుగుతోందని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు ఆరోపించారు. బుధవారం బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో ఆయన మా  జిన్నారం, పారానగర్  గ్రామాలను డంపింగ్ యార్డులుగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదన్నారు.

రాత్రికి రాత్రే డంపింగ్ యార్డ్‌ను ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పంట పొలాల మధ్య డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం సరికాదన్నారు.

ఈ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు. మాజీ సర్పంచులు, ప్రజా ప్రతినిధులను ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయడం తగదన్నారు. వారందరినీ భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

సునీతాలక్ష్మారెడ్డి అరెస్టు అక్రమం: కేటీఆర్

హైదరాబాద్ (విజయక్రాంతి): ప్రజల పక్షాన పోరాడుతున్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యేకు నిరసన తెలిపే హక్కు కూడా లేదా, ఇదేనా ఇందిరమ్మ రాజ్యమని ధ్వజమెత్తారు.

డంపింగ్ యార్డు ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ప్రజలను కూడా అక్రమంగా అరెస్టు చేస్తున్నారని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డితో పాటు బీఆర్‌ఎస్ నేతలను, నిర్బంధించిన ప్రజలను బేషరతుగా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.