14-02-2025 12:47:21 AM
జాతీయ రహదారి సర్వే అడ్డగింత
మహబూబాబాద్, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): మానుకోట జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పట్టణ శివారు సాలార్ తండా మీదుగా వలిగొండ భద్రాచలం పీ 930 జాతీయ రహదారి వెళ్తుండగా రోడ్డు కోసం సర్వే చేసేందుకు వచ్చిన రెవెన్యూ అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. మా భూములను జాతీయ రహదారి పేరుతో లాక్కోవద్దని డిమాండ్ చేశారు. కొద్దిసేపు జాతీయ రహదారిపై కూర్చుండి నిరసన వ్యక్తం చేశారు. అధికారులు పోలీస్ పహారాలోనే సర్వేను కొనసాగించారు.