calender_icon.png 19 January, 2025 | 11:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేవైఎం నిరుద్యోగ ధర్నాలో ఉద్రిక్తత

03-07-2024 12:09:25 AM

యాదాద్రి భువనగిరి,జూలై2(విజయ క్రాంతి): రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలనే డిమాండ్‌తో  భువనగిరిలో మంగళవారం బీజేవైఎం తలపెట్టిన నిరుద్యోగ ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద బీజేవైఎం నాయకులు ధర్నా చేపట్టారు. ఈ కార్యాలయం ఎదుటే ఉన్న జెడ్పీ కార్యాలయంలో నిర్వహిస్తున్న జెడ్పీ ప్రత్యేక సమావేశానికి ఎమ్మె ల్సీ తీన్మార్ మల్లన్న హాజరయ్యారని తెలుసుకున్న నాయకులు, ఆయనను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. జెడ్పీ కార్యాలయంలోకి దూసుకొచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు గేట్లు మూసివేసి అడ్డుకోవడంతో తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. బీజేవైఎం నాయకులను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కి తరలించారు. దీంతో తీన్మార్ మల్లన్న కార్యాలయం గేటు వద్దకు రావడంతో నిరుద్యోగ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. బీజేవై ఎం పట్టణ అధ్యక్షుడు కానుకుంట్ల రమేశ్ అధ్యక్షతన జరిగిన ధర్నాలో మున్సిపల్ వైస్ చైర్మన్ దశరథ, బీజేపీ పట్టణ అధ్యక్షుడు బలరాం తదితరులు పాల్గొన్నారు.