దేశవ్యాప్తంగా హిందువుల ఆందోళనబాట
గుర్తుతెలియని వ్యక్తుల దాడిలో పలువురికి గాయాలు
భారత్ చొరవ తీసుకుని గురువును విడిపించాలని ఇస్కాన్ ప్రతినిధుల డిమాండ్
ఢాకా, నవంబర్ 26: ఇస్కాన్ గురువు చిన్మయ్ కృష్ణదాస్ ప్రభు సోమవారం బంగ్లాదేశ్‌లో అరెస్టయ్యారు. రాజద్రోహం కేసులో ఆయన్ను డిటెక్టివ్ పోలీసులు అదుపులోకి తీసుకోగా, దేశవ్యాప్తంగా హిందువులు నిరసనలు వెల్లువెత్తాయి. ఢాకా, చిట్టగాంగ్, షాబాగ్ తదితర నగరాల్లో హిందూత్వవాదులు, ఇస్కాన్ ప్రతినిధులు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. గురువును బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బంగ్లా ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు భారత ప్రభుత్వం చొరవ చూ పించి, బంగ్లా ప్రభుత్వంతో చర్చలు జరిపి గురువును విడుదల చేయించాలని ఇస్కాన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు.
భారత విదేశాంగశాఖ ఖండన..
బంగ్లాదేశ్ పోలీసులు అరెస్ట్ చేయడంపై భారత విదేశాంగశాఖ స్పందించింది. శాంతియుతంగా నిరసనలు తెలపడం తప్పు కాదని, ఆయన అరెస్టును ఖండిస్తున్నామని ప్రకటించింది. మైనార్టీల ఇండ్లలో దోపీడీ, వ్యాపార సంస్థల విధ్వంసం వంటివి దుర్మార్గమైన చర్యలని పేర్కొన్నది. ‘హిందూత్వ దాడులను నిరసిస్తున్న మైనార్టీ వర్గాలపై దాడులు సరికాదు. మైనార్టీలకు ప్రభుత్వం భద్రత కల్పిం చాలి’ అని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ డిమాండ్ చేశారు.
అరెస్ట్ ఎందుకంటే..
షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వా త దేశవ్యాప్తంగా హిందువులపై జరుగుతున్న దాడులపై చిన్మయ్ కృష్ణదాస్ ప్రభు గళమెత్తారు. అక్టోబర్‌లో బంగ్లాలో జరిగిన ఓ సభ లో ఆయన బంగ్లా జాతీయ జెండా కంటే, ఎ క్కువ ఎత్తులో కాషాయ జెండాను ఎగురవేయడం వివాదాస్పదంగా మారింది. దీంతో ప్రత్వం ఈయనతో పాటు మరో 18 మందిపై రాజద్రోహం మోపింది.
కోర్టు వెలుపల చిన్మయ్ ప్రసంగం..
ఢాకా విమానాశ్రయంలో పోలీసులు గు రువు చిన్మయ్ కృష్ణదాస్ ప్రభును అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించారు. కోర్టుకు వందలాదిగా మద్దతుదారులు తరలిరావడం తో కోర్టు వెలుపల నుంచి ఆయన ప్రసంగించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరి ష్కరించే వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశా రు. శాంతియుతంగా నిరసనలు తెలుపుతామన్నారు.