- ఎస్సీ వర్గీకరణపై అభిప్రాయాల వెల్లడికి తరలివచ్చిన కుల సంఘాలు
- వినతులు సీకరించిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ షమీమ్ అక్తర్
ఆదిలాబాద్, జనవరి 3 (విజయక్రాంతి): ఆదిలాబాద్ కలెక్టరేట్ వద్ద శుక్రవారం సల్ప ఉద్రిక్తత నెలకొంది. ఎస్సీ వర్గీకరణ విషయమై ఏకసభ్య కమిషన్ చైర్మన్ షమీమ్ అక్తర్ కలెక్టరేట్‌లో శుక్రవారం బహిరంగ విచారణ నిర్వహించారు. తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు మాల, మాది వివిధ ఉప కులాల ప్రజలు పెద్దఎత్తున తరలిరావడంతో ఉద్రిక్తత నెలకొంది.
మాల, మాదిగ సంఘం నాయకులు ఒక్కసారిగా కలెక్టరేట్ ప్రధాన గేటు వద్దకు దూసుకురావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో సల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. వర్గీకరణ కావాలంటూ మాదిగలు, వద్దంటూ మాలలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో కలెక్టరేట్ ప్రాంగణం దద్దరిల్లింది. చివరకు డీఎస్పీ జీవన్‌రెడ్డి కలెక్టరేట్‌కు చేరుకుని ఇరు కులాల వారిని సముదాయించారు.
ఉమ్మడి జిల్లా నుంచి వచ్చిన మాల, మాదిగ, ఉపకులాల ప్రజల నుంచి కమిషన్ చైర్మన్ షమీమ్ అక్తర్, అదనపు డైరెక్టర్ శ్రీధర్, కలెక్టర్ రాజరిషా వినతులను సీకరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి సునీత, రాజేశర్‌గౌడ్, రవీందర్, ఉమ్మడి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీలు మనోహర్, శంకర్, దుర్గా ప్రసాద్, సజీవన్ పాల్గొన్నారు.