దమ్మపేట (విజయక్రాంతి): మండల పరిధిలోని మల్లారం గ్రామంలో డబుల్ బెడ్రూం ఇళ్ళను అక్రమంగా ఆక్రమించుకున్న కొందరిని పోలీసులు రెవిన్యూ అధికారులు ఖాళీ చేయించారు. దీనితో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. మాకు ఇళ్లు లేవని ఇప్పుడు ఖాళీ చేయిస్తే మా పరిస్థితి ఏం కావాలని వారు పోలీసులను అడ్డుకున్నారు. పోలీసులు ఖాళీ చెయ్యాల్సిందేనని కరాఖండిగా చెప్పడంతో అక్రమదారులు వెంట తెచ్చుకున్న డిజిల్ పోసుకొని చస్తామని బెదిరించారు. అందులో ఓ మహిళ సృహా తప్పడంతో పోలీసులు వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ నిబంధనలను విరుద్ధంగా ఆక్రమించుకోవడం నేరమని ఖాళీ చేయకుంటే కేసులపాలవుతారని హెచ్చరించడంతో వారు ఖాళీ చేసి వెళ్లారు.