01-03-2025 12:42:29 PM
హైదరాబాద్: వరంగల్ జిల్లాలోని మామునూర్ వద్ద బీజేపీ- కాంగ్రెస్(BJP-Congress) శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణ నెలకొంది. కాంగ్రెస్- బీజేపీ శ్రేణుల తోపులాటతో మామునూర్ వద్ద ఉద్రికత్తత చోటుచేసుకుంది. మామునూర్ విమానాశ్రయానికి(Warangal Mamnoor Airport) కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్రం అనుమతి ఇవ్వడంతో ప్రధాని నరేంద్ర మోదీకి బీజేపీ శ్రేణులు పూలాభిషేకం చేసేందుకు భారీగా తరలివచ్చారు. బీజేపీ నేతలు వచ్చిన సమయంలోనే కాంగ్రెస్ నేతలు విమానాశ్రయం వద్దకు చేరుకున్నారు. దీంతో ఇరు వర్గాల ఒకేసారి విమానాశ్రయం వద్దకు రావడంతో ఘర్షణ తలెత్తింది. రాష్ట్ర ప్రభుత్వం(Telangana Government) వల్లే విమానాశ్రయానికి అనుమతులు వచ్చాయని కాంగ్రెస్ శ్రేణులు తెలిపారు. పోటాపోటీగా ప్రధాని మోడీ చిత్రపటానికి బీజేపీ, రేవంత్ చిత్రపటానికి కాంగ్రెస్ శ్రేణుల పాలాభిషేకం చేయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు భారీగా మోహరించారు.