calender_icon.png 29 April, 2025 | 5:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీసీసీ కార్యాలయంలో ఉద్రిక్తత

29-04-2025 12:53:03 AM

  1. పురమల్ల  వాక్యాలపై భగ్గుమన్న మంత్రి పొన్నం అనుచరులు

ఏఐసీసీ కార్యదర్శి ఎదుటే  బాహా బహి

కరీంనగర్,, ఏప్రిల్28(విఐకాయక్రాంతి): కరీంనగర్ ...డీసీసీ  కార్యాలయం లో  ఉద్రిక్తత  వాతావరణం చోయు చేసుకుంది. సోమవారం సాయంత్రం జరిగిన పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం లో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జి పురమల్ల శ్రీనివాస్ చేసిన వాక్యాల పై భగ్గుమన్న మంత్రి పొన్నం అనుచరులు- ఏ ఐ సి సి కార్యదర్శి ఎదుటే  బాహా బహి కి దిగారు.

మంత్రి  పొన్నం  ప్రభాకర్  ను  ఉద్దేశించి  పీరు ప్రస్తావించ కుండా  ఆ  ఒక్కడూ అంటూ వాఖ్యలు  చేయడంతో  నియోజక  వర్గ  ఇంచార్జి  పురమళ్ళ  శ్రీనివాస్  పై  దాడి కి యత్నంచారు. కరీంనగర్  నుండి మార్కెట్ కమిటీ కోసం  ఫైళ్లు  పంపిస్తే  అడ్డుకుంటున్నారని, ఏ  పనులు  కావడం  లేదని ఆ ఒక్కడు పార్టీని  భ్రష్టు పట్టిస్తున్నారంటూ   మాట్లాడిన  పురమళ్ళ  శ్రీనివాస్  ను మంత్రి  అనుచరులు చుట్టు ముట్టి అడ్డుకున్నారు.

ఈ  సందర్బంగా తోపులాట జరిగింది. ఏ ఐ సి సి  సెక్రటరీ  విశ్వనాథన్  ఎదుటే  గొడవ  పడ్డ  కాంగ్రెస్  శ్రేణుల ను వేదిక పై ఉన్న నాయకులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సమావేశం ముగిసిన అనంతరం కూడా గొడవకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకోంది. . సోమవారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, మనకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అధ్యక్షతన కరీంనగర్ డిసిసి కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది,

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏఏసీసీ సెక్రెటరీ విశ్వనాథన్ పెరుమాళ్  హాజరు కాగా రాష్ర్ట కాంగ్రెస్ పరిశీలకులు నమిండ్ల శ్రీనివాస్ రఘునాథ్ రెడ్డి గ,జిల్లాకు చెందిన శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారితో పాటు పార్లమెంటు  నియోజకవర్గం ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు  నియోజకవర్గ ఇన్చార్జులు కురుమల్ల శ్రీనివాస్ , వడిదల ప్రణవ బాబు ,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్   సత్తు మల్లేశం. 

మాజీ శాసనసభ్యులు పథకం మృత్యుంజయం,  ఆరెపల్లి మోహన్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.  సమావేశాన్ని ఉద్దేశించి పలువురు నాయకులు కార్యకర్తలు తమ అభిప్రాయాలను తెలియజేసినారు ఈ రోజు జరిచిన సంఘటన ను పార్టీ ముందు ఉంచాలని నిర్ణయించారు. శ్రీనివాస్ గతంలోనూ ఇలాంటి వాఖ్యలు చేసి షోకాజు నోటీసు అందుకున్నారు. ఈ సారి చర్యలు తప్పకపోబచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి.