calender_icon.png 13 January, 2025 | 12:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెంట్రల్ లైబ్రరీ వద్ద ఉద్రిక్తత

16-07-2024 12:15:00 AM

పలువురు నిరుద్యోగుల అరెస్ట్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 15 (విజయక్రాంతి): గ్రూప్ 2, గ్రూప్ 3, డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని నిరుద్యోగులు చలో సెక్రటేరియట్‌కు పిలుపునివ్వడంతో సోమవారం చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీ, అశోక్‌నగర్ వద్ద హైటెన్షన్ నెలకొంది. నిరుద్యోగులు బయటకు రాకుండా ఉదయం నుంచే పోలీసులు సెంట్రల్ లైబ్రరీ ఎదుట, అశోక్‌నగర్ జంక్షన్‌లో వద్ద భారీ బందోబస్తు నిర్వహించారు. నగరంలోని పలు ప్రధాన జంక్షన్లలోనూ పోలీసులు మోహరించారు. అయితే నిరుద్యోగులు సెంట్రల్ లైబ్రరీ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు వెంటనే లైబ్రరీ గేటుకు తాళంవేసి వారిని నిలువరించారు. ఈ క్రమంలో విద్యార్థులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పరీక్షలను వాయిదా వేయాలని, పోస్టుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. పోలీసులు పలువురిని అరెస్ట్ చేసి చిక్కడపల్లి, బొల్లారం పోలీస్ స్టేషన్లకు తరలించారు.