calender_icon.png 25 November, 2024 | 12:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిరిసిల్ల కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత

12-11-2024 01:25:28 AM

సిరిసిల్లలో తాజా మాజీ సర్పంచులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు 

  1. కలెక్టరేట్‌కు ముట్టడికి యత్నించిన -తాజా మాజీ సర్పంచులు 
  2. పలవురిని అరెస్ట్ చేసి హెడ్ క్వార్టర్స్‌కు తరలించిన పోలీసులు
  3. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాకు వినతి 

సిరిసిల్ల, నవంబర్ 11(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెం డింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ముట్టడికి యత్నించిగా, పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ హెడ్ క్వార్టర్‌కు తరలించారు. ఈ సందర్భంగా తాజా మాజీ సర్పంచులు మాట్లాడుతూ తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శాంతి యుతంగా ధర్నా చేస్తున్నా ప్రభుత్వం చలించడం లేదన్నారు.

అభివృద్ధి పనుల కోసం వెచ్చించిన అప్పులు తీర్చలేక కొంతమంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదని విమ ర్శించారు. పెండింగ్ బిల్లులు విడుదల చేశాకే ప్రభుత్వం ‘స్థానిక’ ఎన్నికలకు వెళ్లాలన్నారు. కాగా కొందరు పోలీసులను తప్పించుకొని లోపలికి వెళ్లి కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాకు వినతిపత్రం అందజేశారు.

అర్జీదారులకు అంతరాయం

తాజా మాజీ సర్పంచులు కలెక్టరేట్ గేట్ ముందు బైఠాయించి నిరసన తెలపడంతో ముందస్తుగా పోలీసులు గేట్‌లు మూసివేశారు. దీంతో ప్రజావాణిలో ఫిర్యాదు చేసేం దుకు వచ్చిన అర్జీదారులకు ఇబ్బందులు తప్పలేదు. నిరసనకారులను అరెస్ట్ చేసి, హెడ్‌క్వార్టర్స్‌కు తరలించిన తర్వాత గేట్‌లు తీయడంతో అర్జీదారులు ప్రజావాణిలో పాల్గొన్నారు.