03-04-2025 01:04:03 PM
రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ కాంగ్రెస్ సర్కారుపై విద్యార్థుల ఆందోళన
విద్యార్థులను అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలింపు
శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): ఏబీవీపీ విద్యార్థి సంఘాల నేతలు మరోసారి హెచ్‌సీయూను(Hyderabad Central University) ముట్టడించారు. ప్రధాన గేటు వద్ద భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాట చేశారు. దీంతో గురువారం హెచ్‌సీయూ రెండవ గేటు ముందు ఏబీవీపీ(Akhil Bharatiya Vidyarthi Parishad) కార్యకర్తలు ఆందోళన చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కంచే గచ్చిబౌలి భూములను పరిరక్షించాలంటూ పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి డౌన్ డౌన్(Revanth Reddy down down) అంటూ కాంగ్రెస్ సర్కారుపై విద్యార్థులు నినాదాలు చేస్తూ హెచ్‌సీయూ రెండవ మెయిన్ గేట్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. హెచ్ సీయూ గేటు దూకి లోపలికి వెళ్తేందుకు కార్యకర్తలు ప్రయత్నించారు. లోపల జరుగుతున్న పనులను అడ్డుకుంటామని ఏబీవీపీ నేతలు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు రెండవ గేటు వద్దకు చేరుకొని ఆందోళన చేస్తున్న విద్యార్థులను అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు విద్యార్థులకు మధ్య తీవ్రమైన తోపులాట జరిగింది, పలు విద్యార్థి నేతలకు స్వల్ప గాయాలయ్యాయి.