calender_icon.png 6 November, 2024 | 4:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హయత్‌నగర్ పాఠశాల వద్ద ఉద్రిక్తత

06-11-2024 01:17:28 AM

న్యాయం చేయాలని విద్యార్థి కుటుంబీకుల ఆందోళన

ఎల్బీనగర్, నవంబర్ 5: స్కూల్ గేటు మీద పడడంతో హయత్‌నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న అజయ్ అనే విద్యార్థి సోమవారం మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే, విద్యార్థి కుటుంబ సభ్యులు, బంధువులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చే స్తూ మంగళవారం పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. వారికి మద్దతుగా కార్పొ రేటర్ నవజీవన్‌రెడ్డి, బీజేపీ రంగారెడ్డి అర్బ న్ అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆందోళనలో పాల్గొన్నారు.

ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతోనే విద్యార్థి మృతిచెంది నట్లు ఆరోపించారు. పాఠశాలకు వాచ్‌మన్ కూడా లేరని తెలిపారు. సమాచారం తెలుసుకున్న రంగారెడ్డి జిల్లా డీఈవో సుశీందర్ రావు, వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డితో పాటు పోలీసులు వెంటనే పాఠశాలకు చేరుకొని విద్యార్థి కుటుంబీకులతో చర్చించారు. ప్రభుత్వం తరఫున రూ.4 లక్షల నష్టపరిహారం, డబుల్ బెడ్‌రూమ్ ఇంటితో పాటు విద్యార్థి తల్లికి కాంట్రాక్ట్ పద్ధతిలో ఏదైనా ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం కల్పిస్తామని డీఈవో హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు.