హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(Greater Hyderabad Municipal Corporation) ప్రధాన కార్యాలయం వద్ద గురువారం ఉద్రిక్తత నెలకొంది. పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ కాంట్రాక్టర్లు ఆందోళన చేస్తున్నారు. కాంట్రాక్టర్లు కార్యాలయం ప్రధానద్వారం ముందు భైఠాయించారు. ఏడాదిగా బిల్లులు చెల్లించడం లేదని కాంట్రాక్టర్లు ఆందోళన చేస్తున్నారు. ఇద్దరు కాంట్రాక్టర్లు(Contractors) పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేశారు. తోటి కార్మికులు అడ్డుకుని పెట్రోల్ బాటిళ్లను లాక్కున్నారు. కాంట్రాక్టర్ల నిరసనపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి స్పందించారు. యూనియన్ లీడర్లతో కమిషనర్ చర్చలు జరుపుతున్నారు. చర్చలు పూర్తయ్యే వరకు తాత్కాలికంగా నిరసన నిలుపివేశారు.