బాత్రూంలో వీడియోలు తీశారని విద్యార్థినుల ఆందోళన
మేడ్చల్, జనవరి 1(విజయక్రాంతి): మేడ్చల్ మండలం కండ్లకో సీఎంఆర్(ఐటీ) ఇంజినీరింగ్ కళాశాల హాస్టల్ వద్ద బుధ రాత్రి విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థినులు బాత్రూంలో ఉండగా, ఆ కళాశాల చెందిన సిబ్బంది ఒకరు వీడియో తీశారని ఆరోపిస్తూ విద్యార్థినులు ఆందోళన చేశారు. ఈ విషయం తెలిసి విద్యార్థి సంఘాలు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. కళాశాల యాజ రావాలి.. అంటూ ఎన్‌ఎస్‌యూఐ, ఏబీవీపీ నాయకులు నినాదాలు చేశారు. హాస్టల్ సెక్యూరిటీ రూమ్‌ను ధ్వంసం చేశారు. మేడ్చల్ సీఐ సత్యనారాయణ హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని విద్యార్థులను శాంతింపజేశారు. నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు బాధ్యులైన సిబ్బం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.