కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. అనుచరులతో కలిసి శేరిలింగంపల్లి అరెకపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. కౌశిక్ రెడ్డి.. దొంగ అని గమనించకుండా పార్టీలో స్థానం ఇచ్చారని అరెకపూడి గాంధీ ఆరోపించారు. బీఆర్ఎస్ లోకి వచ్చినప్పటి నంచి కౌశిక్ రెడ్డి తీరు సరిగా లేదని అరెకపూడి విమర్శించారు. కౌశిక్ రెడ్డి తీరు వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందిందని తెలిపారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కోవర్టుగా వ్యవహరించారని చెప్పారు. కౌశిక్ రెడ్డి ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారని గాంధీ అన్నారు.