calender_icon.png 20 September, 2024 | 5:29 PM

బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్తత

07-09-2024 12:41:14 AM

నిర్మల్, సెప్టెంబర్ 6(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, 17 డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ శుక్రవారం ఏబీవీపీ నాయకులు నిర్వహించిన ట్రిపుల్ ఐటీ ముట్టడి స్వల్ప ఉద్రికత్తతకు దారి తీసింది. 9 వేల మంది విద్యార్థులు ఉన్న ఈ విశ్వవిద్యాలయంలో సమస్యలను పరిష్కరింంచాలని రెండు రోజులుగా నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ట్రిపుల్ ఐటీ ముట్టడి చేపట్టింది.

విద్యార్థి సంఘం నాయకుడు శశిధర్ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రధాన గేట్ వద్దకు రావడంతో సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు వారిని లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. వీసీ ప్రోద్బలంతో సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు అక్కడ ఉన్న ఆటో డ్రైవర్ల సహకారంతో ఆందోళన చేస్తున్న వారిపై దాడి చేశారని శశిధర్ ఆరోపించారు.

తమ బట్టలు చించివేశారని, కింద పడేసి కొట్టారని ఆరోపించారు. వీసిని వెంటనే బదిలీ చేయాలని కోరారు. ఆందోళనలో సంఘం నాయకులు కిరణ్, ఆకాష్, సాయి, దినేష్, అజయ్, మహేష్, పవన్ పాల్గొన్నారు.