హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): విద్యాశాఖలో ఉద్యోగులకు బదిలీల టెన్షన్ పట్టుకుంది. గత కొన్నేళ్లుగా ఆయా శాఖల్లో తిష్టవేసి కూర్చున్న ఉద్యోగులు బదిలీల అంశంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల విద్యాశాఖలో ఇప్పటికే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు జరిగిన విషయం తెలిసిందే. ఇక సాధారణ బదిలీల్లో భాగంగా పాఠశాల విద్యాశాఖ, ఇంటర్ బోర్డు, సాంకేతిక విద్యాశాఖతోపాటు ఇతర శాఖల్లోని కమిషనరేట్ పరిధిలో ఉండే ఉద్యోగులకు సంబంధించిన బదిలీ ప్రక్రియ రాష్ట్రంలో కొనసాగుతోంది. ఈక్రమంలోనే బదిలీ అయి ఎక్కడికి వెళ్తామో అని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 20 వరకు ఈ బదిలీల ప్రక్రియ కొనసాగనుంది.