09-04-2025 12:00:00 AM
తెలంగాణ వైన్ డీలర్స్ ఆసోసియేషన్ డిమాండ్
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): రాష్ట్రంలోని బార్ అండ్ రెస్టా రెంట్లకు కూడా ప్రతి రెండేళ్లకోసారి టెండర్లు నిర్వహించాలని, అప్పుడే రాష్ర్ట ప్రభుత్వానికి మరింత ఆదాయం వస్తుందని తెలంగాణ వైన్స్ డీలర్స్ అసోసియేషన్ రాష్ట అధ్యక్షుడు డీ వెంకటేశ్వరరావు, జనరల్ సెక్రటరీ రామచంద్రారెడ్డి అన్నారు. మంగళవారం సోమా జిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. వైన్స్ ద్వారా రెండేండ్లకు ఒకసారి టెండర్ పద్ధతిలో లైసె న్స్ తీసుకోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 87 శాతం ఆదాయం వస్తుంటే... బార్ అండ్ రెస్టారెంట్ల ద్వారా కేవలం 13 నుంచి 15 శాతం ఆదాయం మాత్రమే వస్తోందని తెలిపారు. జిల్లాల్లో 10 గంటలకు మద్యం షాపులు మూసివేసినట్లే... నగరాల్లో కూడా 10గంటలకే మద్యం దుకాణాలను మూసివేయాలనడం అవివేకమన్నారు.
ఎందుకు తమ దుకాణాల సమయాన్ని తగ్గించాలని బార్ షాపుల నిర్వాహకులు రోడ్డెక్కుతున్నారో అర్ధం కావడం లేదన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే తాము పర్మి ట్ రూమ్‌లు నిర్వహిస్తున్నామన్నారు. కానీ కొన్ని బార్ అండ్ రెస్టారెంట్లలో వినియోగదారులకు అక్రమంగా మద్యం అమ్మకాలు నిర్వహిస్తున్నారని వారిపై చర్య లు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బార్ అండ్ రెస్టా రెంట్ల సమాయాన్ని 11 గంటలకు పైగా పెంచడం వల్ల ప్రభావం తమపై పడుతుందని, దాని వల్ల 20శాతం నష్టాలు చవిచూ స్తున్నామని చెప్పారు. సమావేశంలో వైన్ డీలర్స్ అసోసియేషన్ ట్రెజరర్ సుభాశ్, వై స్ ప్రెసిడెంట్ ప్రభు పాల్గొన్నారు.