calender_icon.png 23 January, 2025 | 3:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డివిజన్ల వారీగా టెండర్లు పిలవాలి

23-01-2025 12:54:05 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 22 (విజయక్రాంతి): గ్రేటర్ వ్యాప్తంగా బల్దియా చేపట్టే డీసిల్టింగ్ పనులకు సర్కిళ్ల వారీగా కాకుండా డివిజన్ల వారీగా టెండర్లు పిలవాలని తెలంగాణ వడ్డెర కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అ  డిమాండ్ చేసింది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ చీఫ్ ఇంజినీర్ భాస్కర్‌రెడ్డికి.. ఆ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్. రమేష్ బుధవారం వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. ఎంసీహెచ్‌గా ఉన్నప్పటి నుంచి వడ్డెర కులస్తులు మాత్రమే డీసిల్టింగ్ పనులు చేస్తూవస్తున్నారన్నారు. డివిజన్ల వారీగా టెండర్లను పిలవడం కారణంగా వడ్డెర కాంట్రాక్టర్లు అందరికీ ఉపాధి ఉండేదన్నారు. గత ఏడాది కాలంగా సర్కిల్ స్థాయిలో ఒకటి లేదా రెండు టెండర్లు మాత్రమే పిలవడం వలన చాలామంది వడ్డెర కాంట్రాక్టర్లకు పనులు ఉండటం లేదన్నారు.

ఈ విషయంపై గతంలో కమిషనర్‌ను కలిసి విన్నవించగా, పాత పద్ధ్దతిలోనే టెండర్లు పిలుస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. అదే క్రమంలో 2025 ఏడాదికి బల్దియాలో డీసిల్టింగ్ పనులను సర్కిళ్ల వారీ విధానాన్ని రద్దుచేసి డివిజన్ల వారీగా టెండర్లు పిలిచి వడ్డెర కాంట్రాక్టర్లు అందరికీ పని కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.