calender_icon.png 25 February, 2025 | 8:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తునికాకు టెండర్లను వెంటనే పూర్తిచేయాలి

18-02-2025 12:00:00 AM

గిరిజన సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎఫ్‌డీవో కార్యాలయం ఎదుట ధర్నా

భద్రాచలం, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి) : తునికాకు టెండర్ల ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని, తునికాకు ప్రూనింగ్ పనులను వెంటనే ప్రారంభించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం భద్రాచలం ఎఫ్డిఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఎఫ్డిఓ సుజాతకు వినతిపత్రం అందించడం జరిగింది.

ఈ సందర్భంగా జరిగిన సభలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ర్ట నాయకులు మచ్చా వెంకటేశ్వర్లు, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కారం పుల్లయ్యలు మాట్లాడుతూ ఏజెన్సీలోని గిరిజనులు, ఇతర పేదలకు తునికాకు సేకరణ రెండవ పంటగా వేసవి పంటగా ఉపాధి కల్పిస్తోందని అటువంటి తునికాకు సేకరణ ప్రక్రియను ప్రారంభించడంలో రాష్ర్ట ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తుందని అన్నారు.

ఇప్పటికే తునికాకు టెండర్లు పూర్తిచేసి ప్రూనింగ్ పనులు ప్రారంభించాల్సి ఉండగా నేటికీ టెండర్లు కూడా పిలవకపోవడం దారుణమని అన్నారు. రాష్ర్ట అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ తోపాటు రాష్ర్టస్థాయిలో అధికారులకు అనేకమార్లు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ప్రభుత్వం తునికాకు ప్రక్రియను ప్రారంభించడంలో మీన మీసాలు లెక్క పెడుతోందని విమర్శించారు.

ఏజెన్సీలో గెలిచిన గిరిజన ఎమ్మెల్యేలు, ఎంపీలు తునికాకు సమస్య పై నోరు మెదపకపోవడం సిగ్గుచేటని అన్నారు. తునికాకు టెండర్ల ప్రక్రియను ప్రారంభించి తునికాకు ప్రూనింగ్ పనులను వెంటనే ప్రారంభించక పోతే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏజెన్సీ వ్యాప్తంగా దిగ్బంధనం కార్యక్రమాన్ని చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రేపాక శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం స్వామి, మర్మం చంద్రయ్య, గిరిన సంఘం బాధ్యులు రామ్మూర్తి, ఆదయ్య, సుజాత పాల్గొన్నారు.