కరీంనగర్‌సిటీ, జనవరి10 (విజయ క్రాంతి): కరీంనగర్‌లో ప్రజలను, విద్యార్థు లను ఇబ్బందుల గురి చేస్తున్న వానర సై న్యంను పట్టుకునేందుకు నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు తీస్కుంటుందని కమీషనర్ చాహాత్ బాజ్ పాయ్ అన్నారు. శుక్రవారం రోజు నగరంలోని మంకమ్మతోట దన్గర్ వాడి ప్రభుత్వ పాఠశాలను అధికారులతో కలిసి సందర్శించారు. పాఠశాలలో ఇటీవల కోతుల గుంపు భయానికి విద్యార్థి కింద పడిపోయిన సంఘటన స్థలాన్ని స్వయంగా పరిశీలించారు.
గాయపడిన విద్యార్థి ఆరోగ్య పరిస్థితి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. నగరపాలక సంస్థ ద్వారా ప్రత్యేకం గా ప్రింట్ చేయించిన పెద్ద గొండ ముచ్చు ఫొటో ఫ్లెక్సీలను ప్రారంభించి... పాఠశాలకు పలు ప్లేక్సీ బొమ్మలను అందజేశారు.
ఈ పలు డివిజన్ లలో వానర సైన్యం విహా రంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు చేపడుతుందని తెలిపారు. వాటిని బోనుల్లో పట్టుకొని అడవిలో వదిలేసేందుకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దానికి సంబంధించి టెండర్ ప్రక్రియను కూడ పూర్తి చేశామని తెలిపారు. ఈ కార్యక్ర మంలో వెట ర్నరీ అధికారి శ్రీనివాస్, ఎన్వి రాన్మెంటల్ ఇంజనీర్ స్వామీ పాల్గొన్నారు.